lottery in UAE: యూఏఈలో తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ

lottery in UAE: యూఏఈలో తెలుగు యువకుడికి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. యూఏఈలో ఏకంగా తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ త‌గిలేసింది. తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకున్నాడు ఈ తెలుగు యువకుడు. ఈ త‌రుణ‌లోనే యూఏఈలో ఏకంగా తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ వ‌చ్చింది. lottery in UAE

Telugu youth wins Rs 240 crore lottery in UAE

యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్(29) అనే యువకుడు
నివాసం ఉంటున్నాడు. అతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొనడంతో, ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్(240 కోట్లు) గెలుచుకున్నాడు అనిల్ కుమార్. ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే లాటరీ టికెట్ కొన్నానని వెల్ల‌డించాడు. ఇక అందులో చివరి నంబర్లు మా అమ్మ పుట్టిన తేదీ కావడంతోనే నాకు అదృష్టం కలిసి వచ్చిందని తెలిపాడు యువకుడు. lottery in UAE

Also Read: Virat Kohli: కోహ్లీ రెస్టారెంట్ ధరలపై విమ‌ర్శ‌లు…ఆస్తులు అమ్ముకోవాలంటూ ఫైర్‌!

ఈ డబ్బుతో తన తల్లిదండ్రులను అబుదాబి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడతానని, ఒక లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును చారిటీలకు ఇస్తానని యువకుడు ప్రకటన చేశాడు. ఇదే లాటరీ ఇండియాలో గెలిస్తే దాదాపు రూ.90 కోట్లు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేదని తెలిపాడు అనిల్ కుమార్. దీంతో యూఏఈలో లాటరీ ద‌క్కించుకున్న సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. lottery in UAE

Also Read: Money: ఈ 3 సూత్రాలు పాటిస్తే, కోటీశ్వ‌రులు కావ‌డం ప‌క్కా..?

Share your love