Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?

Jubilee Hills Bypoll jaggareddy comments viral
Jubilee Hills Bypoll jaggareddy comments viral

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. హైడ్రా వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రాధికారులపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు జగ్గారెడ్డి. కొందరు హైడ్రా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ ను ఓడించేందుకు కుట్రలు పన్నారని బాంబు పేల్చారు జగ్గారెడ్డి. Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll jaggareddy comments viral

తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు. హైడ్రా వాళ్లు గులాబీ పార్టీకి లాభం చేకూరేలా చూస్తున్నారని అనుమానంగా ఉందని ఆయన వెల్లడించారు. అలాంటి వారిపై రంగనాథ దృష్టి పెట్టాలని కోరారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. Jubilee Hills Bypoll

Also Read: Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా…

దీంతో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకోవాలి కానీ ఇలా స్వయంగా కాంగ్రెస్ నేతనే ఓడిపోతుందని చెబితే.. ప్రజలు ఇక్కడ ఓటు వేస్తారని కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో.. కేకే సర్వే తమ రిపోర్టును బయటపెట్టింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ కంటే 18% ఓట్లు గులాబీ పార్టీకి వస్తాయని వెల్లడించింది కేకే సర్వే. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి పథకాలు ప్రకటించిన కూడా జూబ్లీహిల్స్ లో ఛాన్స్ లేదని కేకే సర్వే స్పష్టం చేసింది. Jubilee Hills Bypoll

Also Read: KK Survey: కాంగ్రెస్ కు వణుకుపుట్టిస్తున్న KK సర్వే… ప్రతి గల్లీలో BRS దే…