Jaggareddy: కోమటిరెడ్డి క్యారెక్టర్ పై వార్తలు..కాంగ్రెస్ మ‌రో త‌ల‌నొప్పితెచ్చిన‌ జగ్గారెడ్డి ?

Jaggareddy
Jaggareddy

Jaggareddy: తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంఘటన తెరపైకి వస్తోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఒక్కో మంత్రి ఒక్కో దారి అన్నట్లుగా వ్యవహారం తయారైంది. మంత్రులకు సంబంధించిన సీక్రెట్ విషయాలు నేరుగా మీడియా ఛానల్స్ లో వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా ఛానల్స్ లో కూడా వార్తలు వస్తున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Jaggareddy

Jaggareddy on komatireddy venkatreddy issue

అయితే ఓ మహిళ ఐఏఎస్ అధికారికి సంబంధించిన న్యూస్ బయటకు రావడం పై తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తనను అవమానించేందుకు ఇలాంటి వార్తలు క్రియేట్ చేశారని ఫైర్ అయ్యారు. ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసలు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి స్పందించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై వార్తలు వేయమని చెప్పిన వాడిని చెప్పుతో కొడతానంటే వార్నింగ్ ఇచ్చాడు జగ్గారెడ్డి. Jaggareddy

Also Read: Teenmaar Mallanna: తీన్మార్‌ మల్లన్న నుంచి చేజారిపోయిన Q News యూట్యూబ్ ఛానల్ ?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక చరిత్ర అంటూ వెల్లడించారు. ఎంతో కష్టపడి అంచలంచలుగా ఎదిగిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు రాయమని ఎవరు చెప్పారని నిలదీశారు. కోమటిరెడ్డి మీద ఇలాంటి కథనాలు రాయాలని అలాగే వీడియోలు రిలీజ్ చేయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. దీంతో కాంగ్రెస్ లో ఉన్న మ‌నిషే ఈ త‌తంగం న‌డిపిస్తున్నాడ‌ని, తెలిసే..జ‌గ్గారెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు గులాబీ పార్టీ సోష‌ల్ మీడియా కౌంట‌ర్ ఇస్తోంది. Jaggareddy

Also Read: komatireddy venkat reddy: నాకింత విషమిచ్చి చంపేయండి..లేడీ ఐఏఎస్ వార్త‌ల‌పై సీరియ‌స్‌?

Share your love