Rashmika: అందుకే నేను రాను.. వస్తే ఇలా చేస్తారు.. రష్మిక అసహనానికి కారణం..!

Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా అంటే తెలియని వారు ఉండరు. ఈమె తన నటనా అభినయంతో ఎంతో పేరు సంపాదించుకుంది.. ఇండస్ట్రీలోకి వచ్చిన

The reason for Rashmika impatience

Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా అంటే తెలియని వారు ఉండరు. ఈమె తన నటనా అభినయంతో ఎంతో పేరు సంపాదించుకుంది.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోనే సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ నేషనల్ క్రష్ గా మారింది. సినిమాలు, బిజినెస్ లు ఇలా ఒక్కటేమిటి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఎదురు లేదనిపించుకుంటుంది.

The reason for Rashmika impatience

అలాంటి రష్మిక మందన్నా ఈ మధ్యనే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తో మన ముందుకు వచ్చి ఎంతో ఆకట్టుకుంది. అలాంటి ఈమె ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకు వచ్చింది. అక్కడ హోస్ట్ గా ఉన్న జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. దీంతో ఆమెను నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. ఇదే సమయంలో మగవాళ్ళ గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆమె మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే వాళ్లకు బాధ తెలిసేది అంటూ ఒక మాట మాట్లాడింది. (Rashmika)

Also Read: Deepika Padukone: మళ్లీ అడ్డంగా బుక్కైన దీపిక పదుకొనే.. ఆ హీరోతో అలాగే చేస్తున్నావా.?

అయితే దీన్ని కాస్త వ్యంగ్యంగా అర్థం చేసుకున్న బాయ్స్, మమ్మల్ని కించపరుస్తావా మా కష్టం విలువ నీకేం తెలుసు అంటూ పెద్ద పెద్ద కామెంట్లు పెడుతున్నారు. ఒక కుటుంబం నడవాలంటే మగాడి కృషి, ఈ సమాజంలో కష్టం చేసేవాడు అంటే మగవాడే అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ఇష్యూపై మళ్లీ స్పందించిన రష్మిక మందన్నా నేను మగవాళ్లను కించపరచలేదు. నేను ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడలేదని క్షమించమని కోరింది.

The reason for Rashmika impatience

నేను అందుకే ఇంటర్వ్యూ లకి రాను.వాళ్ళు అడుగుతారు నేను ఏదైనా సమాధానం చెప్తే కొంతమంది రాంగ్ గా అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన్నా మైసా అనే సినిమాలో నటించబోతోంది. ఈ విధంగా సక్సెస్ ల మీద సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నటువంటి రష్మిక ఇలా మాట్లాడడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పవచ్చు.(Rashmika)