
Ramya Krishnan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రాలలో బాహుబలి ఒకటి.. ఈ సినిమాకు ముందు ఇలాంటి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే రాలేదని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలో చేసిన నటినటులు అందరూ మంచి క్రెడిట్ సంపాదించారు. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి 1,2 సినిమాలు చేశారో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి కూడా ఎక్కడికో వెళ్లిపోయింది.
Ramya Krishnan comments on the movie Baahubali are generating heat
అలాంటి బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ లో నటించింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. అయితే తాజాగా ఈమె జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్నటువంటి జయమ్ము నిశ్చయమ్మురా అనే షో కి వచ్చారు.. ఇందులో తన వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో శ్రీదేవి తన అభిమాన నటి అని జగపతిబాబు తెలియజేశారు.. అలాగే ఈ చిత్రంలో శ్రీదేవి చేయాల్సిన పాత్రను మీరు చేశారంటూ రమ్యకృష్ణ తో అనడంతో ఆమె స్పందిస్తూ ఈ విషయం నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది..(Ramya Krishnan)
Also Read: Actress: బయటపడ్డ నటి బాగోతం.. నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్.. 2 కోట్లు ఇస్తే.!
కానీ బాహుబలిలో నటించడం నా అదృష్టం.. కొన్ని అనుకోని మ్యాజిక్స్ అలా జరుగుతూ ఉంటాయి.. నా విషయంలో కూడా ఈ సినిమా అలాంటిదే అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. ఇందులో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించడం ఓ డెస్టినీ అని చెప్పుకొచ్చారు.. ఈ పాత్ర ఆమె కోసమే రాసుకున్నట్టుగా ఉన్నదని అన్నారు. అయితే బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తీసుకువచ్చారు రాజమౌళి..

అయితే ఈ చిత్రాన్ని రీ ఎడిట్ చేసి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ టైటిల్ పేరుతో ఈనెల 31వ తేదీన తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా జయమ్ము నిశ్చయమ్మురా అనే ప్రోగ్రాముకు రమ్యకృష్ణ,శోభు యార్లగడ్డ వచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన పలు విశేషాలను రమ్యకృష్ణ ఈ వేదికగా బయట పెట్టారు.(Ramya Krishnan)





