
KCR: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు రెచ్చిపోతున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా, ఏ విషయంలో పడితే ఆ విషయంలో వేలు పెట్టి గబ్బు గబ్బు చేస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గద్ద ముక్కు పంతులు అంటూ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. KCR
Vasamsetti Subhash comments on KCR
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జెట్టి బలిజలు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయినట్లు గుర్తు చేశారు. అయితే వాళ్లందరినీ ఓసీలలో కేసీఆర్ ప్రభుత్వం చేర్చిందని మండిపడ్డారు మంత్రి సుభాష్. ఇందులో భాగంగానే టిఆర్ఎస్ గద్ద ముక్కు పంతులు అంటూ రెచ్చిపోయాడు. అలా శెట్టి బలిజలను ఓసీలలో కలపడం వల్ల చాలా మంది జీవితాలను నాశనం అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే కెసిఆర్ ను తిడుతూ రెచ్చిపోయారు మంత్రి వాసంశెట్టి సుభాష్. KCR
Also Read : Raja Mouli: రంగంలోకి బీజేపీ…డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు ?
అయితే ఏపీ మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలపై గులాబీ పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇస్తోంది. మంత్రి స్థాయిలో ఉన్న వాసంశెట్టి సుభాష్ ఇలా మాట్లాడడం చాలా దారుణమని ఫైర్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి మాట్లాడడం పద్ధతేనా అని గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ నాయకున్ని వాడు వీడు అంటూ సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ అలాగే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. KCR
Also Read : Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?




















