“పెద్ది”లో వైరల్ వయ్యారి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. పుష్ప 2లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. అదే సక్సెస్ ను పెద్దిలోనూ కంటిన్యూ చేయబోతోంది శ్రీలీల. ఇటీవల జూనియర్ సినిమాలో శ్రీలీల వైరల్ వయ్యారిగా ఆకట్టుకుంది. డ్యాన్సులు చేయడంలో శ్రీలీల తర్వాతే మరో హీరోయిన్ అనేంత పేరు తెచ్చుకుంది.

శ్రీలీలకున్న క్రేజ్, ఈ డ్యాన్సింగ్ టాలెంట్ పెద్దికి అడ్వాంటేజ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే పెద్ది సినిమాలో పిక్చరైజ్ చేసే స్పెషల్ సాంగ్ ఫోక్ సాంగ్ అని తెలుస్తోంది. ఫోక్ సాంగ్ లో శ్రీలీల, రామ్ చరణ్ డ్యాన్సులతో థియేటర్స్ లో జోష్ నిండనుంది. ప్రస్తుతం పెద్ది శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ లో దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Share your love