“కపుల్ ఫ్రెండ్లీ” టీజర్ రేపు రిలీజ్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టీజర్ రేపు సాయంత్రం 4.24 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ కథా చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందిస్తున్నారు.

టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కేరళ మన్రో ఐల్యాండ్స్ లో ఓ హోటల్లో కార్తీక్, ప్రీతి, మోహన్, శివ..నలుగురు చెక్ ఇన్ అయి ఉండటం, వారిలో శివ పేరుకు మాత్రం రెడ్ పెన్ తో సర్కిల్ గీసి ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకు అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Share your love