మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా..?

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం నుంచి రాజా గాడికి సాంగ్ విడుదల చేశారు.

రాజా గాడికి సాంగ్ ఎలా ఉందో చూస్తే – మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కు ఎవరైనా జరుగునా, లోకల్ సాంగుకు ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గునా, వెయ్యి నోటు చెల్లుబాటు కాదా, వెయ్యి కోట్ల తెలుగు సినిమా రాదా, చెరువు మీద ఇళ్లు కడితే కూల్చేదెవడరు రా అంటూ సాగుతుందీ పాట. ఈ పాటను సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేయగా, కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ ఇచ్చారు. సింజిత్ హెగ్డే ఆకట్టుకునేలా పాడారు.

Share your love