పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సీక్వెల్స్ చేయాల్సి వుంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే కల్కి 2 లో ప్రభాస్ క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా చూపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రభాస్ నటించాల్సిన మరో సీక్వెల్ సలార్ 2. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
సలార్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులుగా నటించారు. పార్ట్ 2 లో వీరిద్దరి మధ్య వైరం రావడం అనేదే అసలు కథ. ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ కథని తెర పై చూడడం కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ కల్కి 2, సలార్ 2 మాత్రమే చేయాల్సి ఉంది అనుకున్నారు. ఇప్పుడు ది రాజాసాబ్ మూవీకి కూడా సీక్వెల్ ప్లాన్ ఉందట. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ది రాజాసాబ్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. రాజా సాబ్ రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ రానుంది.





