గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, లీసా వంటి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధమవుతోంది. గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్ వంటి కమర్షియల్ హిట్ సినిమాలు రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో అంజలి లీడ్ రోల్ లో మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని 9 క్రియేషన్స్ బ్యానర్ పై రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మిస్తున్నారు.
ఈ రోజు హైదరాబాద్ లోని సంస్థ ఆఫీస్ లో ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ జానర్ లో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

