నిర్మాతలు నష్టాల్లో, కార్మికులు సమ్మెలో

వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ అయ్యాయి. సినీ కార్మికులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతుంటారు. ఈ జూన్ కే మూడేళ్లు పూర్తి కావడంతో వేజెస్ పెంచమని సినీ కార్మికులు అడుగుతున్నారు. 30 శాతం వేతనాలు పెంచమనేది వారి డిమాండ్. ఈ డిమాండ్ కు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. థియేట్రికల్ గా సినిమాలు ఆడక తాము నష్టాల్లో ఉన్నామని నిర్మాతలు అంటున్నారు.

దీంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఈ సమస్య గురించి చెప్పారు. మెగాస్టార్.. సినీ కార్మికులతో కూడా మాట్టాడతాను అన్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా కలవడం జరిగింది. ఆయన కూడా సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకుందామని చెప్పారు. నిర్మాతలు 15 శాతం పెంచుతామని అయితే వర్కింగ్ అవర్స్ మాత్రం పెరగాలి అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే ఈ సమ్మె కొనసాగుతూనే ఉంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu