టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడీ వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ద్రాక్షారామం వెళ్లి అక్కడ ఉన్న దేవాలయంలో ప్రభాస్ గురించి ప్రత్యేకించి పూజలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ..శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని అన్నారు.
ఆమె మాటలతో ప్రభాస్ పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో కూడా ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన రాజా సాబ్ సినిమా త్వరలో థియేటర్స్ లోకి రాబోతోంది. అలాగే ప్రభాస్ ఫౌజీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆయన లిస్టులో ఇంకా స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టార్ గా ప్రభాస్ ను మరింత పైకి తీసుకెళ్లనున్నాయి.





