క్లాష్ అవుతున్న మెగా మూవీస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీని డైరెక్టర్ వశిష్ట్ రూపొందిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు చిరంజీవి ఇంకో సినిమా మెగా 157 మాత్రం సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు విశ్వంభర కూడా రెడీ కావడం ట్విస్ట్ గా మారింది. అక్టోబర్ లో విశ్వంభర మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే మెగా 157, విశ్వంభర క్లాష్ అవుతున్నాయి.

విశ్వంభర అక్టోబర్ లో రిలీజ్ కు వస్తే మెగా 157 మూవీ విడుదలకు రెండు నెలలే గ్యాప్ ఉంటుంది. ఈ రెండు చిత్రాల రిలీజ్ లకు తగినంత గ్యాప్ ఉండాలనేది చిరు ఆలోచన. దీంతో మెగా 157 మూవీని సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అనిల్ రావిపూడి మాత్రం చిరుతో చేస్తున్న మూవీని మాత్రం సంక్రాంతికే రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే విశ్వంభర, మెగా 157 రిలీజ్ డేట్స్ సస్పెన్స్ కొనసాగుతోంది.

Share your love