స్పెషల్ పోస్టర్ తో నిధికి బర్త్ డే విశెస్ చెప్పిన రాజా సాబ్

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో పంచమిగా ప్రేక్షకుల్ని అలరించింది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజా సాబ్ టీమ్ నుంచి ఆమెకు బర్త్ డే విశెస్ అందిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన “రాజా సాబ్” టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “రాజా సాబ్” సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu