వేసవికి ”విశ్వంభర”

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. విడుదల తేదీపై క్లారిటీ లేకపోవడంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది కన్ ఫ్యూజన్ గా మారింది. ఈ కన్ ఫ్యూజన్ కు తెరదించారు చిరంజీవి. ఆయన ఈ రోజు విశ్వంభర రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

వచ్చే వేసవికి విశ్వంభర సినిమాను విడుదల చేస్తామని, తనది హామీ అంటూ మెగాస్టార్ ఒక వీడియో షేర్ చేశారు. సినిమా సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉన్నందున క్వాలిటీ గ్రాఫిక్స్ చేసేందుకు మూవీ టీమ్ టైమ్ తీసుకుందని, అందుకే రిలీజ్ లేట్ అయ్యిందని చిరంజీవి ఈ వీడియో ద్వారా తెలిపారు. ఒక చందమామ కథలా పిల్లల్ని, పిల్లల మనసున్న పెద్దల్ని విశ్వంభర ఆకట్టుకుంటుందని మెగాస్టార్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం 6 గంటలకు విశ్వంభర టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

Share your love