రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రావాలి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కావడం లేదు. కార్మికుల సమ్మె కూడా ఈ సినిమా రిలీజ్ వాయిదాకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మాస్ జాతర రిలీజ్ డేట్ గురించి ఓ కొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాను వచ్చే నెల 12న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. సెప్టెంబర్ 12న మాస్ జాతర రిలీజ్ కన్ఫర్మ్ అనే న్యూస్ బిజినెస్ సర్కిల్స్ లో కూడా వినిపిస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న మాస్ జాతర సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది.





