విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ మూవీ కింగ్డమ్ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్స్ లోకి వచ్చి మంచి వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను కొత్తగా చూపించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అన్నాదమ్ముల నేపథ్యంగా సాగే స్పై థ్రిల్లర్ మూవీగా కింగ్డమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. భాగ్య శ్రీ భోర్సే, సత్యదేవ్ కీ రోల్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో కింగ్డమ్ సినిమాను నిర్మించింది.





