Rayalaseema Backdrop: మళ్ళీ హిట్ల కోసం సీమ పంథా..హీరోల వరుస సినిమాలు!!

టాలీవుడ్ లో మళ్ళీ రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమాలకు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు ఈ పంథాలో వచ్చిన సినిమాలు ఆల్మోస్ట్ హిట్ అయ్యేవి. బాలయ్య, వెంకటేష్, చిరంజీవి లాంటి స్టార్లు రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఇచ్చిన సినిమాలతో డైరెక్ట్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే జోరు మొదలైంది, సమంత నుండి అఖిల్ వరకు అందరూ రాయలసీమ యాసతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Rayalaseema Backdrop సినిమాలు మళ్ళీ హిట్

1995 నుండి 2010 మధ్య రాయలసీమ బ్యాక్డ్రాప్ లో యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ జానర్స్ లో ఎన్నో సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. అంతపురం, తులసి, జయం మనదేరా లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ మర్యాద రామన్న తర్వాత ఆ హవా కాస్త తగ్గింది. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ రాయలసీమ బ్యాక్డ్రాప్ కి డిమాండ్ పెరిగింది.

ఇటీవల సమంత మా ఇంటి బంగారం సినిమా రాయలసీమ యాసతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాలో చిత్తూరు యాస మాట్లాడి మెప్పించాడు. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వస్తున్న ఆ సినిమాలు మళ్ళీ ఆ పంథా పై ఆసక్తిని పెంచాయి. రాబోయే రణబాలి సినిమా కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్ లోనే వస్తోంది.

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా కూడా అదే బ్యాక్డ్రాప్ లో ఫ్యాక్షన్, కామెడీతో రానుంది. ఈ సినిమా హిట్ అవుతుందనే టాక్ నడుస్తోంది. కరెక్ట్ యాసతో, కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తే సినిమా హిట్ అవ్వడం ఖాయం అని టాలీవుడ్ లో అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ సినిమాలు వరుసగా రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu