డయాబెటీస్ ఉన్నవాళ్లకు ఇప్పుడు కొత్త ఆశలు కలిగిస్తూ Weekly Insulin Shot మార్కెట్‌లోకి వచ్చింది. డానిష్ drug maker నోవో నార్డిస్క్ వారి వీక్లీ బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ‘అవిక్లీ’ ని ఇటీవల భారతదేశంలో లాంచ్ చేసింది. ఇది రోజూ ఇన్సులిన్ తీసుకునే వారికి పెద్ద రిలీఫ్ లాగా ఉంటుంది, కానీ అందరికీ ఇది సరైన ఆప్షనా అనేది నిపుణులు చర్చిస్తున్నారు. ఈ వార్తలో డయాబెటీస్ పేషెంట్లు తెలుసుకోవలసిన విషయాలు ఏంటో చూద్దాం.
Weekly Insulin Shot Benefits and Side Effects
ఈ వీక్లీ షాట్‌తో అతిపెద్ద advantage ఏంటంటే సౌలభ్యం. డాక్టర్ రాజీవ్ కోవిల్ ప్రకారం, సంవత్సరానికి 365 షాట్ల నుంచి 52కి తగ్గించడం వల్ల చికిత్సను ఫాలో అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇది భయాన్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా రోజూ ఇంజెక్షన్ గుర్తు పెట్టుకోలేని వాళ్లకు ఇదొక బంపర్ ఆప్షన్. కానీ డాక్టర్ విజయ్ నెగలూర్ మాట్లాడుతూ, కొంతమందికి రోజువారీ ఇన్సులిన్ బెటర్ అని చెప్పారు. బ్లడ్ షుగర్ లెవల్స్, తిన్న ఫుడ్, యాక్టివిటీ లెవల్స్ బట్టి డైలీ డోస్ సర్దుబాటు చేయాల్సి వస్తే, ఈ వీక్లీ షాట్ అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు.
ONWARDS క్లినికల్ ట్రయల్స్ లో ఈ ‘అవిక్లీ’ రోజువారీ ఇన్సులిన్‌తో సమానమైన HbA1c తగ్గింపును ఇస్తుందని తేలింది. కొన్ని స్టడీస్ లో ఇది కొంచెం మెరుగైన రిజల్ట్స్ కూడా చూపించింది. అలాగే, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ తరచుగా రోజువారీ ఇంజెక్షన్లకు భయపడి ఇన్సులిన్ థెరపీని ఆలస్యం చేస్తారు. ఈ వీక్లీ షాట్ ఆ అంతరాయాన్ని తగ్గించి, మెరుగైన కంప్లయిన్స్ మరియు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.
అయితే, వీక్లీ ఇన్సులిన్ ఒక్కటే మ్యాజిక్ కాదు. హెల్తీ హ్యాబిట్స్ ను మర్చిపోకూడదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, బరువు నియంత్రణ, బ్లడ్ షుగర్ మానిటరింగ్ ఇవన్నీ చాలా కీలకం. ప్రతి ఒక్క పేషెంట్ కి వారి వయస్సు, కిడ్నీ ఫంక్షన్, హైపోగ్లైసీమియా రిస్క్ వంటి అంశాలను బట్టి ఏ ఆప్షన్ బెటరో డాక్టర్ తో చర్చించి తీసుకోవాలి. ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే, ఎల్లప్పుడూ మీ హెల్త్ ప్రొవైడర్ ని కన్సల్ట్ చేయండి.





