మహేష్ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చూశాం. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇద్దరు స్టార్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహేష్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చేస్తుంటే, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్, రాజమౌళి చేస్తున్న మూవీ బడ్జెట్ 1000 కోట్లు అని సమాచారం. హాలీవుడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. నవంబర్ లో ఈ సినిమా గురించి పూర్తి వివరాలను రాజమౌళి అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.
మరోవైపు అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నిర్మాణ సంస్థ కూడా హాలీవుడ్ నిర్మాణ సంస్థను పార్టనర్ గా తీసుకుంటే హాలీవుడ్ లో మరింత క్రేజ్ వస్తుందనే ఆలోచనలో ఉందట. అక్కడి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. ఇలా మహేశ్, అల్లు అర్జున్ హాలీవుడ్ తో టైఅప్ అయ్యే మూవీస్ చేస్తున్నారు.





