Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్.. “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అంటూ తమన్నా గుడ్ న్యూస్”.!!

Tamannaah good news saying she is getting married soon

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తమన్నా చెప్పిన మాటలు అభిమానుల్లో కొత్త జోష్ ని నింపాయి. మరి ఇంతకీ తమన్నా చెప్పిన వైరల్ మాటల వెనుక ఉన్న నిజమెంత.. తమన్నా ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిల్కీ బ్యూటీ తమన్నా వయసు పెరిగినా కూడా వన్నెతరగని అందంతో రోజురోజుకి యూత్ కి పిచ్చెక్కిస్తుంది.

Tamannaah good news saying she is getting married soon

చేతినిండా అవకాశాలతో జోరు మీదున్న తమన్నా ఈ మధ్యకాలంలో బ్రేకప్ కారణంగా కాస్త మానసిక వేదన అనుభవించిన సంగతి మనకు తెలిసిందే. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడ్డ తమన్నా దాదాపు రెండు మూడు సంవత్సరాలు డేటింగ్ చేసి ఈ మధ్యనే విడిపోయారు. అయితే వీరి బ్రేకప్ కి కారణం ఏంటో తెలియలేదు. కానీ ప్రస్తుతం ఈ జంట అయితే విడిపోయారు. అయితే తాజాగా తమన్నా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకి కాబోయే భాగస్వామి గురించి తమన్నా మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఒక మంచి పార్ట్నర్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నాను.. (Tamannaah)

Also Read: Pawan Kalyan: ఐటెం బ్యూటీ తో పవన్ కళ్యాణ్ లవ్.. 24 లక్షల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్.!

నాకు కాబోయే వ్యక్తి నా గురించి ఎలా అనుకోవాలి అంటే.. గత జన్మలో నేను ఎంత పుణ్యం చేసుకున్నానో అందుకే నాకు ఇంత మంచి భార్య దొరికింది అని నాకు కాబోయే భర్త సంబరపడిపోవాలి. అయితే ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది నాకు తెలియదు. కానీ త్వరలోనే మీరు ఆయనని చూస్తారేమో అంటూ అందరికీ అనుమానాలు పుట్టించే మాటలు మాట్లాడింది.

Tamannaah good news saying she is getting married soon

ఇక తమన్నా మాటలు విన్న చాలామంది నెటిజన్లు తమన్నా ప్రస్తుతం మరో వ్యక్తితో రిలేషన్ లో ఉందని,త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని,అందుకే త్వరలోనే మీరు ఆయన్ని చూస్తారేమో అంటూ అందరిలో అనుమానాలు పుట్టించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.తమన్నా మాటలు వైరల్ గా మారడంతో చాలామంది అభిమానులు తమన్నా పెళ్లి చేసుకుంటే చూడాలని వెయిట్ చేస్తున్నాం.. అంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Tamannaah)

Share your love