
Renu Desai: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయినా కూడా ఆమెని పవన్ కళ్యాణ్ భార్య గానే ఊహించుకుంటారు.. ప్రతి విషయంలో రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. అంతే కాదు గతంలో పవన్ కళ్యాణ్ విడిపోయాక రేణు దేశాయ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్టు బయట పెట్టగా నీ జీవితంలో మా అన్నయ్య తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అంటూ సోషల్ మీడియాలో బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.అయితే వీటన్నింటికీ రేణు దేశాయ్ ఎక్కడా కూడా తలొగ్గదు.ఆమెకి జరిగిన అన్యాయాన్ని ప్రతిసారి సోషల్ మీడియాలో వివరిస్తూనే ఉంటుంది.
Pawan Kalyan Fans warning to Renu Desai
అలా తాజాగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన పోస్ట్ కి రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై నెట్టింట్లో వైరల్ అవుతుంది. వదినా మీరు మా ఓజీ నుండి విడిపోయినప్పటికీ ఎప్పటికీ మీరు మా అన్నయ్య భార్యనే..మీ జీవితంలో వేరే మగాడిని ఊహించుకోలేం.. అకిరా నందన్ అన్నయ్య కొడుకు. అయితే అన్నయ్య వదిన వల్లే అకిరా పుట్టాడు కాబట్టి మీరు ఎప్పటికీ మా దేవుడు భార్యనే. ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని వదినగానే ఆరాధిస్తాం అంటూ పోస్ట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన పోస్ట్ కి రేణు దేశాయ్ సంచలన రిప్లై ఇచ్చింది. (Renu Desai)
Also Read: Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్.. “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అంటూ తమన్నా గుడ్ న్యూస్”.!!
ఈ పోస్ట్ పెట్టిన అబ్బాయి లేదా అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఇంకా మీరు కొంతే చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ పోస్ట్ పెట్టిన వాళ్లు మొబైల్ ఫోన్లో సొంత ఈమెయిల్ ఐడి ని క్రియేట్ చేసుకుని ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఇంగ్లీషులో పెట్టిన పోస్ట్ పై కామెంట్ చేయడానికి వచ్చాడు.మనం ఇప్పుడు 2025 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికి కూడా ఒక స్త్రీని తండ్రికి లేదా భర్తకి ఆస్తిగానే భావిస్తున్నారు.దాని నుండి బయటపడండి. ఇప్పటికి కూడా చాలామంది స్త్రీలు చదువుకోడానికి లేక ఉద్యోగం చేయడానికి భర్త లేదా తండ్రి అనుమతి తీసుకోవాలి.

కానీ ఇలాంటి మగవాళ్లకు నేను పూర్తిగా వ్యతిరేకం. వీరికి వ్యతిరేకంగా మాట్లాడడానికి నేను ఎప్పుడు ముందే ఉంటాను.. అంటూ ఓ పెద్ద పోస్ట్ పెట్టడమే కాకుండా నేను ఇంస్టాగ్రామ్ లో కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి సంవత్సరం గడిచింది. కానీ ఇప్పుడు ఈ ఇడియట్స్ కొలాబరేషన్ పోస్టులలో కామెంట్స్ చేస్తున్నారు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం రేణుదేశాయ్ పెట్టిన పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.(Renu Desai)
https://www.instagram.com/p/DOfas88DK_k/?utm_source=ig_web_copy_link





