
Kriti Shetty: అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరు. మొదటి సినిమాతోనే ఫేమస్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతోంది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది..
Kriti Shetty fell in love with a Tamil hero
కొత్తగా వచ్చిన హీరోయిన్ హ్యాట్రిక్ హిట్ కొడితే ఏ రేంజ్ లో ఆమె పేరు ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తుందో చెప్పనక్కర్లేదు. అనుకున్నట్టుగానే కృతి శెట్టి పేరు సౌత్ ఇండస్ట్రీ మొత్తం మార్మోగిపోయింది. అలా చాలామంది దర్శక నిర్మాతలు స్క్రిప్టులు పట్టుకొని మరీ కృతి శెట్టి ఇంటి ముందు క్యూలు కట్టారు. అలా కృతి శెట్టి వరుసగా వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.(Kriti Shetty)
Also Read: Nainika: “పబ్లిక్ లోకి ఢీ నైనిక రేటు”.. పరువు పోయింది గా..!
ఈ సినిమాల్లో ఒక్క సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకోలేదు.దాంతో కృతి శెట్టి సినీ కెరియర్ ఆగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు ఇవ్వడానికి కూడా చాలామంది హీరోలు దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఓ తమిళ హీరోతో ప్రేమలో పడిందనే రూమర్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.. కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త ఎక్కువగా వైరల్ అవ్వడంతో చాలామందిని నెటిజన్స్ అందుకే కృతి శెట్టి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటిస్తోంది కావచ్చు అంటూ కామెంట్లుపెడుతున్నారు.

మరి తమిళ హీరోతో కృతి శెట్టి ప్రేమలో పడిందనే వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.ఇక కృతి శెట్టి నుండి నెక్స్ట్ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో చివరిగా శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమాలో కనిపించింది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ తమిళంలో ప్రదీప్ రంగనాథన్ తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK), కార్తీతో వా వాతియార్, జయం రవితో జెనీ అనే సినిమాలో నటిస్తోంది.(Kriti Shetty)





