Anushka Shetty: అనుష్క శెట్టికి కేజీఎఫ్ బ్యూటీ చెల్లెలు అవుతుందా..!

Will Anushka Shetty have a KGF Heroine sister

Anushka Shetty: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రెడ్డి, రావు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఉంటారు. ఆ విధంగానే బెంగళూరు ప్రాంతాల్లో శెట్టిస్ అనే వర్గం ఉంటుంది. ఈ వర్గమే రాజకీయంగా సినిమా రంగంలో కూడా పాపులర్ అయింది. అలాంటి ఈ ప్రాంతం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుష్క శెట్టి..

Will Anushka Shetty have a KGF Heroine sister

ఈమె వల్లే ఈ పదం అనేది చాలా పాపులర్ అయింది.. కొన్నాళ్ళ పాటు అనుష్క శెట్టి టాలీవుడ్ ని ఎలా ఏలిందో చెప్పాల్సిన పని లేదు. అలాంటి శెట్టిస్ వర్గం నుంచి మరో హీరోయిన్ కూడా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుతో దూసుకుపోతోంది.. ఆవిడే శ్రీనిధి శెట్టి.. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆమెను అనుష్క మీకు బంధువు అవుతుందా అని యాంకర్ ప్రశ్నించగా. తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గం ఏ విధంగా వివిధ జిల్లాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉంటుందో ఆ విధంగానే మేము కూడా శెట్టి వర్గానికి చెందిన వాళ్ళం. (Anushka Shetty)

Also Read: Vijay Deverakonda: ఆ హీరోయిన్ వల్ల విజయ్ దేవరకొండకు శని పట్టుకుంది.. అందుకే యాక్సిడెంట్.!

మా పేరు చివరన శెట్టి అని ఉంటుంది. అయితే ఆమె కూడా మా వర్గానికి చెందిన అమ్మాయే. నాకు ఎక్కడో ఒక దగ్గర బంధువై ఉంటుంది కావచ్చు అంటే అనుష్క శెట్టి నాకు అక్క అవుతుంది కావచ్చు అన్నట్టు మాట్లాడింది. అలాగే యాంకర్ మీరు టాలీవుడ్ లో అనుష్క లాగే చాలా ఫేమస్ అవుతున్నారు అని అడగ్గానే, అనుష్క తనకు ఇన్స్పిరేషన్ అని తెలియజేసింది. ఆమెలాగే తాను కూడా ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటానని అన్నది.

Will Anushka Shetty have a KGF Heroine sister

అలాగే హైదరాబాద్ కి షూటింగ్ కి వస్తే నేరుగా హోటల్ లో దిగడం, మరుసటి రోజు షూటింగ్ వెళ్లడం తప్ప మరో పని పెట్టుకోనని తెలియజేసింది. ఇప్పటికే శ్రీనిధి శెట్టి హిట్ 3 సినిమాలో నటించి టాలీవుడ్ మంచి విజయం సాధించింది. దీని తర్వాత సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే సినిమాలో కూడా నటించింది. ఇక కొన్ని కొత్త సినిమాలను కూడా లైన్ లో పెట్టుకుంది. ఈ విధంగా శ్రీనిధి శెట్టి కేజిఎఫ్ సినిమా గుర్తింపు తో తెలుగు ఇండస్ట్రీలో కూడా దూసుకుపోతుందని చెప్పవచ్చు.(Anushka Shetty)

Share your love