Ileana: “ఎహే వెళ్ళిపో ” అంటూ ఇలియానాని అవమానించిన స్టార్ డైరెక్టర్.. షూటింగ్లో కన్నీళ్లు.!

Star director insulted Ileana

Ileana: ఇలియానా ఎంత పెద్ద హీరోయినో చెప్పనక్కర్లేదు.సౌత్ ఇండస్ట్రీలో ఏకంగా కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరోయిన్ ఈ ముద్దుగుమ్మనే. అలా ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.అలా దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత అప్పుడున్న స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో చేసింది.అయితే బాలీవుడ్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో చేస్తున్న సమయంలో తనకి ఎదురైన చేదు అనుభవానికి కన్నీళ్లు పెట్టుకుందట.

Star director insulted Ileana

ఆ డైరెక్టర్ మొహం మీదే అరవడంతో ఏకంగా షూటింగ్లోనే ఏడ్చేసిందట ఇలియానా. మరి ఇంతకీ ఇలియానాని అవమానించిన ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ అనురాగ్ బసూ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్, ఇలియానా ప్రధాన పాత్రలో నటించిన బర్ఫీ సినిమా అందరూ చూసే ఉంటారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇలియానాకి చేదు అనుభవం ఎదురయిందట.అయితే ఓ రోజు ఇలియానా హుషారుగా సినిమా షూటింగ్ సెట్ కి వెళ్లి చాలా సరదాగా నవ్వుతూ వెళ్లి డైరెక్టర్ ని పలకరించిందట. (Ileana)

Also Read: Bunny: బంగారం లాంటి బన్నీ కాపురంలో చిచ్చు పెడుతున్న డైరెక్టర్.. ఫ్యాన్స్ ఫైర్.!

కానీ అప్పటికే కాస్త మూడాఫ్ లో ఉన్న డైరెక్టర్ అనురాగ్ బసూ ని ఇలియానా ప్రేమగా విష్ చేయడాన్ని కూడా కోపంగా తీసుకొని హే ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్లుగా దగ్గరగా అరిచారట. ఇక డైరెక్టర్ ఎప్పుడూ చూపించనంత కోపం ఇలియానా మీద చూపించడంతో సడన్గా కళ్లలో నుంచి నీళ్లు వచ్చి ఇదేంటి దాదా మీకు నేను ఈ సినిమాలో చేయడం నచ్చకపోతే నన్ను తీసేయండి. మీ మీద మీ సినిమా మీద కేసు ఏమి పెట్టను. కానీ ఇలా మాట్లాడకండి అని ఏడ్చేసిందట. అంతేకాదు వెంటనే నిర్మాత సిద్ధార్థరాయ్ కపూర్ కి ఫోన్ చేసి నేను సినిమాలో నటించడం లేదు. షూటింగ్ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పిందట.

Star director insulted Ileana

ఇక ఇలియానా మాటలు విన్న నిర్మాత వెంటనే షూటింగ్ సెట్ కి వచ్చారట. ఆ తర్వాత డైరెక్టర్ అనురాగ్ బసూ ఇలియానా దగ్గరికి వచ్చి నేను ఏదో కోపంలో బ్యాడ్ మూడ్ లో ఉండి అలా మాట్లాడాను.దాని గురించి అంతగా పట్టించుకోకు. ఫీల్ అవ్వకని నచ్చజెప్పారట. ఇక ఆ తర్వాత డైరెక్టర్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఇలియానా అప్పట్నుండి అనురాగ్ బసూతో చాలా బాగా కలిసిపోయిందట.అలాగే తనని ఇల్లు అని పిలిచే ఏకైక వ్యక్తి అనురాగ్ బసూ అంటూ తాజా ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పుకొచ్చింది.(Ileana)

Share your love