
Bunny: ఏంటి ఆ డైరెక్టర్ ఎంతో అన్యోన్యంగా ఉండే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా..ఎందుకు వారి బంధం లోకి ఈ డైరెక్టర్ దిగుతున్నారు.. అల్లు అర్జున్ అభిమానులు ఆ డైరెక్టర్ పై ఎందుకు గుర్రుగా ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య రొమాంటిక్ సీన్స్,ఐటమ్ సాంగ్స్, ఇంటిమేట్ సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలంటే కేవలం అలా వచ్చి ఇలా కనిపించి వెళ్లిపోవడం కాదు.ప్రతి ఒక్క పాత్రలో పర్ఫెక్ట్ గా నటించగలగాలి.
The director who is making a mess in the Bunny married life
అది రొమాంటిక్ సన్నివేశమైనా.. కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశమైనా.. నవ్వు పుట్టించే సన్నివేశమైనా.. ఏదైనా సరే అన్ని పాత్రలో నటించగలిగితేనే నటినటులుగా పూర్తిస్థాయి గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తాము చేయబోయే సినిమాల్లో ఒకటి రెండు సీన్లు అయినా యూత్ ని ఆకట్టుకునేలా బోల్డ్,రొమాంటిక్ సన్నివేశాలు ఉండాలి అనుకుంటారు. అయితే ఒకటి రెండు కాదు ఈ మధ్యకాలంలో అయితే చాలా సినిమాల్లో ఎక్కువ శాతం అలాంటి సీన్సే ఉంటున్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.(Bunny)
Also Read: Tollywood: ఛీ ఛీ నువ్ అసలు మనిషివేనా.. మహేష్ తండ్రి సినిమాని కాపీ చేసి మోసం చేస్తారా.!
ఈ సినిమాకి 600 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని అఫీషియల్ గా ఫిక్స్ చేశారు.అయితే ఈ మధ్యనే తన నానమ్మ చనిపోవడంతో హైదరాబాద్ కు వచ్చిన అల్లు అర్జున్ మళ్లీ తన నెక్స్ట్ షెడ్యూల్ కోసం షూటింగ్లో జాయిన్ అయిపోయారట. అయితే నెక్స్ట్ షెడ్యూల్ అబుదాబీలోని లివా ఒయాసిస్ ప్రాంతంలో తెరకెక్కిస్తున్నారట.అయితే ఈ ప్రాంతంలో దీపికా పదుకొనే అల్లు అర్జున్ ల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ని ప్లాన్ చేశారట డైరెక్టర్.. అంతేకాదు ఈ సాంగ్లో కాస్త రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది.

ఇక ఈ విషయం లీక్ అవ్వడంతో చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్యోన్యంగా ఉంటున్న అల్లు అర్జున్ కాపురంలో ఇప్పుడు చిచ్చు పెట్టడం అవసరమా అట్లీ.. మితిమీరిన రొమాన్స్ పెట్టి బంగారం లాంటి బన్నీ కాపురంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నావా.. ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో సినిమా ఇండస్ట్రీ లో ఉండే వారు ఇవన్నీ పట్టించుకోరు.ముఖ్యంగా వారి భార్యలు కూడా సినిమా నీ సినిమాలాగే రిసీవ్ చేసుకుంటారు పర్సనల్గా తీసుకోరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Bunny)





