
Hardik Pandya: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇతను ఆసియా కప్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగింది. అందులో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నాడు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. ప్రస్తుతం ఇతను మ్యాచ్లు ఆడుతూ బిజీగా కడుపుతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే…. ఇతడు మే 31, 2020న సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితం కొనసాగించారు.
Also Read: Nela Usiri: నేల ఉసిరి మొక్క గురించి మీకు తెలుసా..? ఇది తింటే 100…
Hardik Pandya new lover’s background will make you swoon
నటాషా సినిమాలలో ఎప్పటిలానే నటించింది. హార్దిక్ పాండ్యా అద్భుతంగా మ్యాచులు ఆడుతూ ఎంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక వారు వ్యక్తిగత పనులలో బిజీగా ఉండడంతో పెద్దగా సమయాన్ని కేటాయించుకోలేకపోయారు. ఆ క్రమంలోనే వారిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దాంతో 2024 జులై నెలలో విడాకులు తీసుకుంటున్నామని వారి అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. విడాకుల అనంతరం వారి కుమారుడికి కో పేరెంట్స్ గా ఉంటామని తన కుమారుడి బాధ్యతలను తీసుకుంటామని చెప్పారు. విడాకుల తర్వాత తన కుమారుడిని తీసుకొని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది. ముంబై, హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా తన కుమారుడిని హార్దిక్ పాండ్యా వద్దకు పంపుతూ ఉంటుంది. ఇక విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా కొంతమంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అందులో గాయని జాస్మిన్ వాలియా కూడా ఒకరు.
Also Read: Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?
వీరిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించాలని అనేక రకాల వార్తలు వచ్చాయి. అనంతరం వారిద్దరూ విడిపోయినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్యా నటి మహిక శర్మతో డేటింగ్ చేస్తున్నట్లుగా కొన్ని రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి బయట కొన్ని సందర్భాలలో కెమెరా కంటపడ్డారు. దాంతో వీరిద్దరి ప్రేమ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే పాండ్య కొత్త గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ గురించి అందరూ తెగ సర్చ్ చేస్తున్నారు. ఈమె ఒక ప్రసిద్ధ మోడల్. అంతేకాకుండా అనేక షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలలో పనిచేసింది. అంతేకాకుండా పలు రకాల బ్రాండ్లతో కలిసి పని చేసింది. ఇండియన్ ఫ్యాషన్ అవార్డులలో మోడల్ ఆఫ్ ది ఇయర్ గా కూడా మహిషా శర్మ ఎంపికయింది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులు ఉన్నారు. హార్దిక్ పాండ్యాతో ఎఫైర్ కారణంగా సోషల్ మీడియాలో మహిక శర్మ హాట్ టాపిక్ గా మారారు.
Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూల్చే ప్రమాదం ?




















