
Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 21 అంటే మళ్ళీ ఆదివారం… రోజున… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్ ఫోర్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ బిగ్ ఫైట్ జరుగుతుంది. రెండు జట్లు కూడా సూపర్ ఫోర్ కు తాజాగా ఎంట్రీ ఇచ్చాయి.
Also Read: Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?
Another fight between Team India and Pakistan Asia Cup 2025
నిన్న యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన పాకిస్తాన్ సూపర్ ఫోర్ లోకి అర్హత సాధించింది. ఇప్పటికే సూపర్ ఫోర్ లోకి వచ్చిన టీమిండియాను… వచ్చే ఆదివారం రోజున ఢీకొట్టనుంది పాకిస్తాన్. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 14వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూల్చే ప్రమాదం ?
ఇందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చిత్తు చేసింది టీమిండియా. ఆ సమయంలో షేక్ హ్యాండ్ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… షేక్ హ్యాండ్ వివాదం తెరపైకి… వచ్చి రాజుకునే ప్రమాదం ఉంది.
Also Read: Nela Usiri: నేల ఉసిరి మొక్క గురించి మీకు తెలుసా..? ఇది తింటే 100…




















