
Sharwanand: ఏంటి శర్వానంద్ భార్యతో విడాకులు తీసుకోబోతున్నారా.. ఇది నిజమేనా.. ఎందుకు శర్వానంద్ పై ఈ రూమర్లు వినిపిస్తున్నాయి..నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగితేనే కదా సోషల్ మీడియాలో ఈ రూమర్ వినిపిస్తుంది అంటున్నారు చాలామంది ఈ విషయం తెలిసిన నెటిజన్లు.మరి శర్వానంద్ విడాకుల వార్తల్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Sharwanand divorce from his wife
శర్వానంద్ రక్షిత రెడ్డి ప్రస్తుతం దూరం దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. పాప పుట్టినప్పటి నుండి ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చి చివరికి విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారట. అయితే విడాకులు తీసుకోవడానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పాటు ఇద్దర్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారట. అయితే ఎన్నిసార్లు పెద్దలు కన్విన్స్ చేసినా కూడా వీరి తీరు మారడం లేదట.(Sharwanand)
Also Read: Prabhas: దీపిక పదుకొనే పై పగ బట్టిన ప్రభాస్.. వరుస షాక్స్.!
ఇద్దరూ చాలా కోపంతో ఉండడంతో సందీ కుదిర్చడానికి వెళ్లిన పెద్దమనుషులు కూడా ఇబ్బందులు పడుతున్నారట.అయితే శర్వానంద్ కాస్త ఆలోచన పడి విడాకులకు దరఖాస్తు చేయకుండా పరస్పర అంగీకారంతో కొద్ది రోజులు వేరుగా ఉండి కోపం చల్లారక పాప కోసం అయినా కలవాలని అనుకుంటున్నారట. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న హీరో కాబట్టి శర్వానంద్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదట.

ముఖ్యంగా భార్యకు విడాకులు ఇస్తే పాప ఒంటరిది అయిపోతుంది అనే ఉద్దేశంతో పాప కోసమైనా కలిసి ఉండాలి అని శర్వానంద్ నిర్ణయం తీసుకున్నారట.అందుకే విడాకుల దిశగా అడుగులు వేయకపోయినప్పటికీ ఇద్దరు ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది.అలా రక్షిత రెడ్డి శర్వానంద్ ని వదిలేసి తన పుట్టింటికి వెళ్ళినట్టు సమాచారం. మరి నిజంగానే శర్వానంద్ రక్షిత రెడ్డి తో గొడవలు పడి విడాకుల వరకు వెళ్లారా అనేది శర్వానంద్ నోరు విప్పితే గాని బయటపడదు..(Sharwanand)


