Break Fast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా…అయితే ప్ర‌మాదం తెచ్చుకున్న‌ట్లే?

Break Fast: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఏ పనిని ప్రారంభించారు. బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల తొందరగా ఆకలి వేయదు. ఎనర్జీ శరీరానికి అందుతుంది. చేసే పని పైన ప్రత్యేకమైన శ్రద్ధను పెడతారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉన్నట్లయితే కడుపులో ఆకలిగా ఉంటుంది. దానివల్ల నీరసంగా ఉంటారు. పనిమీద శ్రద్ధ ఉండదు. కళ్ళు తిప్పడం, తలనొప్పి, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. అయితే నేటి కాలంలో చాలామంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తున్నారు. కడుపు టైట్ గా ఉందని కొంతమంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయరు. మరి కొంతమంది బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ తినడం పూర్తిగా మానేస్తారు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల బరువు తగ్గుతామని సన్నగా నాజుకుగా ఉండవచ్చని అనుకుంటారు. కానీ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్యులు సూచనలు చేస్తున్నారు. Break Fast

if skip Break Fast Health may disturb


బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేయడం వల్ల నీరసం, అలసట లాంటి సమస్యలు ఏర్పడతాయి. శరీరానికి ఏమాత్రం ఎనర్జీ ఉండదు. అంతేకాకుండా మెదడు పనితీరు దెబ్బతింటుంది. శరీరానికి తగినన్ని పోషకాలు అందవు. అజీర్తి, గుండె సమస్యలు ఏర్పడతాయి. బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది. దానివల్ల గుండె సమస్యలు అధికంగా ఏర్పడతాయి. బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేయడం వల్ల బరువు పెరుగుతారు. టిఫిన్ చేసే సమయంలో కూడా సరైన సమయాన్ని పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల లోపే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలని సూచనలు చేస్తున్నారు. ఆ తర్వాత తిన్నట్లయితే బరువు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Also Read: Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… జ‌గ‌న్ తో రాజ‌గోపాల్ రెడ్డి ర‌హ‌స్య మీటింగ్‌..70 కార్ల‌తో !

ఇక బ్రేక్ ఫాస్ట్ లో చాలా సున్నితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అవసరమైతే వెజిటేబుల్స్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, ఇడ్లీ, చపాతి, దోశ లాంటి సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అలా కాదని పూరి, బజ్జి, ఫాస్ట్ ఫుడ్ ఇలా తిన్నట్లయితే జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. జంక్ ఫుడ్ బ్రేక్ ఫాస్ట్ లో తిన్నట్లయితే జీవక్రియ మందగిస్తుంది. కడుపులో మంట ఏర్పడుతుంది. అల్సర్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు ఉదయం పూట సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలామంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ మానేసి జ్యూస్ లు తాగుతూ ఉంటారు. అలా చేసినా కూడా తప్పకుండా ఏదో ఒకటి టిఫిన్ చేయాలి.

Also Read: CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…