Sada: “నా జీవితంలో చెత్త సీన్ అదే”.. ఇంటికి వెళ్లి బోరున ఏడ్చిన సదా.?

Sada went home and cried in frustration
Sada went home and cried in frustration

Sada: సీనియర్ నటి సదా జయం,ఔనన్నా కాదన్నా, దొంగ దొంగది, అపరిచితుడు, నాగ వంటి సినిమాల్లో నటించింది. ఇక ఈ హీరోయిన్ తెలుగులో చేసినవి తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ లాంటి గుర్తింపు అయితే తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ సినిమా చేసి ఇంటికి వెళ్లి బోరున ఏడ్చేసిందట.

Sada went home and cried in frustration

నా జీవితంలో అలాంటి చెత్త సీన్ ఎందుకు చేశానయ్యా బాబోయ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుందట. మరి ఇంతకీ సదా కి చెత్త సీన్ అనిపించిన ఆ సినిమా ఏంటి.. ఎందుకు ఇంటికి వెళ్లి ఏడ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్ సదా జయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో నితిన్,సదా, గోపీచంద్ వీళ్ళ ముగ్గురి యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు.(Sada)

Also Read: Rashi: ఆ డైరెక్టర్ కి రాశి ఉసురు గట్టిగానే తగిలిందిగా.. మోసం చేసి.!

వీళ్ళ యాక్టింగ్ తో ఈ సినిమా అద్భుతమైన హిట్ కొట్టింది.అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన గోపీచంద్ ఓ సీన్లో సదా మొహాన్ని నాలుకతో నాకుతారు. అయితే నాలుకతో నాకే ఆ సీన్ చేసేటప్పుడు మొదట సదా నేను చేయను అని చెప్పిందట. కానీ ఈ సీన్ సినిమాకి హైలైట్ అని డైరెక్టర్ చెప్పడంతో చేసేదేమీ లేక ఓకే చేసిందట. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఛీ ఛీ నేను ఆ సీన్ ఎందుకు చేశానా అని కన్నీళ్లు పెట్టుకుందట.

Sada went home and cried in frustration

అంతేకాదు జీవితంలో మరోసారి ఇలాంటి సీన్ చేయకూడదు అని అనుకుందట.అయితే ఈ విషయాన్ని చాలా సంవత్సరాల తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇక కొత్త హీరోయిన్లు రావడంతో సదా కి అవకాశాలు తగ్గిపోయాయి. అలా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. అలా తేజ అహింస మూవీలో ఒక కీ రోల్ పోషించింది. అలాగే పలు ఈవెంట్లు డాన్స్ షోలకు జడ్జిగా చేస్తుంది.(Sada)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu