
Rashi: ఏంటి ఆ డైరెక్టర్ కి రాశి ఉసురు తగిలిందా? రాశి ఉసురు తగలడానికి ఆ డైరెక్టర్ చేసిన తప్పేంటి..ఎందుకు ఆ డైరెక్టర్ పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాశి రీసెంట్గా ఓ టాక్ షోలో చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో దుమారాన్ని సృష్టించాయి.నేను సినిమాల్లో మంచి అవకాశాలతో రాణిస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ నన్ను తన సినిమాకు తీసుకొని మోసం చేశాడు. అయితే ఆ డైరెక్టర్ మొదట నాకు చెప్పింది ఒకటి. ఆ తర్వాత నాపై చిత్రీకరించింది మరొకటి.అయితే ఫస్ట్ షార్ట్ రోజే నేను అర్థం చేసుకున్నాను.
That director was really impressed by Rashi charm
ఆ డైరెక్టర్ నన్ను పాజిటివ్ రోల్ లో చూపించడం లేదు నెగిటివ్గా చూపిస్తున్నాడని..కానీ ఏమీ అనలేని పరిస్థితి.అందుకే సైలెంట్ గా చేసేసాను. కానీ ఈ పాత్ర చేయడం వల్లే నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా సినిమాల్లో నా కెరియర్ మాటాష్ అయింది. ఇండస్ట్రీలో నా జీవితం క్లోజ్ అయింది.ఈ పాత్ర వల్లే నాకు అవకాశాలు రాలేదు అంటూ సంచలనం వ్యాఖ్యలు చేసింది. మరి ఆ డైరెక్టర్, సినిమా ఏంటి అని అడగగా ఇప్పటికే నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను.(Rashi)
Also Read: Little Hearts:”బొంగులో లిటిల్ హార్ట్స్ అందులో ఏముంది”.. యాటిట్యూడ్ స్టార్ కామెంట్స్ .?
ఆ డైరెక్టర్ పేరు ఆ సినిమా పేరు మళ్ళీ చెప్పదలచుకోలేను అంటూ రాశి క్లారిటీ ఇచ్చింది.అయితే రాశి చెప్పింది డైరెక్టర్ తేజ గురించే.ఎందుకంటే గతంలో చాలా ఇంటర్వ్యూలలో డైరెక్టర్ తేజ నిజం మూవీ కోసం తనని నెగిటివ్ పాత్రలో తీసుకొని తనను మోసం చేశారని,మొదట కథ వేరే చెప్పి ఆ తర్వాత నెగిటివ్గా చూపించారని బాధపడింది.

అంతే కాదు తేజ వల్లే నా సినీ కెరీర్ నాశనం అయింది అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం రాశి మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఆమె ఫ్యాన్స్ రాశి ఆ రోజు తనని నెగిటివ్ గా చిత్రీకరించినందుకు తేజను ఎంత తిట్టుకుందో..అందుకే రాశి ఉసురు తగిలి ఇప్పుడు డైరెక్టర్ తేజ కి ఒక్క హిట్ కూడా పడడం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Rashi)



Director: సొమ్ము ఒకరిది సోకు ఒకరిది.. ఆ మెగా హీరో సెల్ఫ్ డబ్బా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్.!