Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?

Ponguleti Srinivas: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వ్యాపారవేత్తగా జనాలకు దగ్గరైన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత పార్లమెంటు సభ్యులుగా ఎదిగారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…. వైసీపీలో ఎంపీగా కూడా పనిచేశారు. ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరి… మంత్రి పదవి మాత్రం దక్కించుకోలేకపోయారు.

Also Read: Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… జ‌గ‌న్ తో రాజ‌గోపాల్ రెడ్డి ర‌హ‌స్య మీటింగ్‌..70 కార్ల‌తో !

Minister Ponguleti Srinivas biopic

అయితే మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి… పార్టీని గెలిపించారు. అందబలం కలిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనతో పాటు ఖమ్మం జిల్లా మొత్తం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అయితే ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి కూడా దక్కింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కీలక నాయకులుగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు.

Also Read: CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్ రాబోతుందట. శ్రీనన్న అందరివాడు అనే టైటిల్ తో ఈ సినిమాను భయ్యా వెంకట నరసింహారాజు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆయనే నిర్మాత అలాగే దర్శకుడు. పొంగులేటి శ్రీనివాస్ పాత్రలో హీరో సుమన్ నటిస్తున్నారని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Hardik Pandya: ఒకేసారి ఇద్దరితో..హార్దిక్ పాండ్య కొత్త లవర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…