Ramya Krishnan: “మీ క్యారెక్టర్ ఇలాంటిదా”.. డబ్బులిచ్చి డైరెక్టర్ చేసిన పనికి రమ్యకృష్ణ కన్నీళ్లు.!

Ramya Krishnan sheds tears for the director work!

Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎన్నో సినిమాలతో సౌత్ ఇండియాలో తన పేరుని వైరల్ చేసుకుంది.అలా తన యాక్టింగ్ తో తెలుగు,తమిళ భాషల్లో రాణించింది.అయితే అలాంటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీగానే సినిమాలు చేస్తోంది. బాహుబలి లాంటి సినిమాలో ఓ కీరోల్ పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.అయితే అలాంటి రమ్యకృష్ణ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ చేతిలో డబ్బులు పెట్టి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుందట.

Ramya Krishnan sheds tears for the director work!

మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనేది చూస్తే.. రమ్యకృష్ణ ఎంతో మంది దర్శకులతో సినిమాలు చేసింది. వారిలో ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఒకరు… ఇక రమ్యకృష్ణ ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఊయల, బడ్జెట్ పద్మనాభం,దీర్ఘ సుమంగళీభవా,ఆహ్వానం వంటి సినిమాల్లో నటించింది. అయితే రమ్యకృష్ణ ఇన్ని సినిమాలు కృష్ణవంశీ డైరెక్షన్లో చేసింది అంటే వీరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉండేదో చెప్పనక్కర్లేదు.అయితే ఓసారి ఆహ్వానం సినిమా షూటింగ్ అయిపోయాక ఎస్వీ.కృష్ణారెడ్డి రమకృష్ణ దగ్గరికి వచ్చి అలా చేసినట్టు ఇంటర్వ్యూలో చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు.(Ramya Krishnan)

Also Read: Trisha Vijay: ఒకే బెడ్రూంలో త్రిష విజయ్.. ఫైర్ అయిన జర్నలిస్ట్.!

ఆ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆహ్వానం సినిమా షూటింగ్ చివరి రోజు అది.ఆ టైంలో ఇక షూటింగ్ కి రావాల్సిన పనిలేదు అని అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. ఇక అదేరోజు నేను రమ్యకృష్ణ దగ్గరికి వెళ్లి ఒక తాంబూలం ప్లేట్ తో అంటే ఆ ప్లేట్లో చీర, గాజులు, పువ్వులు ఇలా ఒక పుట్టి నుండి మెట్టినింటికి వెళ్లే అమ్మాయికి లేదా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే తాంబూలం ఎలా ఇస్తారో అచ్చం అలాగే రమ్యకృష్ణ కి తాంబూలం ప్లేట్ ఇచ్చాను. అంతే కాదు ఆ తాంబూలం ప్లేట్ తో పాటు పదివేల రూపాయల డబ్బులు కట్ట అందులో పెట్టి ఇచ్చాను.

Ramya Krishnan sheds tears for the director work!

ఆ సమయంలో రమ్యకృష్ణ ఇదేంటండి అని అడిగితే.. నువ్వు ఇన్ని సినిమాల్లో నాతో జర్నీ చేశావు. నువ్వు మా ఇంటి ఆడపడుచు లాగే అని ప్రేమగా ఆమె చేతిలో పెట్టాను. ఇక నేను చూపించిన ప్రేమకి రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది అంటూ ఎస్ వి కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ సందర్భం రమ్యకృష్ణ నన్ను కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది అంటూ చెప్పారు.అలా అందరూ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో విసిగించే డైరెక్టర్లే కాదు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్ ఉన్న డైరెక్టర్లు కూడా ఉంటారని ఎస్వి కృష్ణారెడ్డి నిరూపించారు.(Ramya Krishnan)

Share your love