Nag Aswin: “కర్మ అనుభవించాల్సిందే”.. దీపిక పదుకొనే కి కౌంటర్ ఇచ్చిన నాగ్ అశ్విన్.!

Nag Aswin countered Deepika Padukone

Nag Ashwin: దీపిక పదుకొనే పై నెగిటివిటీ అమాంతం పెరిగిపోతుంది. ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేకే ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఆమెని సినిమా నుండి పక్కన పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఓ పక్క దీపిక పదుకొనేని స్పిరిట్ మూవీలో తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకున్నారు అనే రచ్చ సోషల్ మీడియాలో కొనసాగుతున్న తరుణంలోనే కల్కి-2 లో కూడా దీపిక పదుకొనేను తీసివేస్తున్నట్టు అధికారికంగా వైజయంతి మూవీస్ వాళ్ళు ప్రకటించి మరో రచ్చలేపారు.

Nag Aswin countered Deepika Padukone

అయితే కల్కి -2 నుండి దీపిక పదుకొనేని తీసివేయడానికి కారణం ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాటు కేవలం ఐదు నుంచి ఏడు గంటల సమయం మాత్రమే సినిమా కోసం కేటాయిస్తానని కండిషన్ పెట్టడంతో ఆమెను తీసేసినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే చాలామంది చాలా రకాలుగా దీపిక పదుకొనేపై ట్రోల్స్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.(Nag Aswin)

Also Read: Prabhas: దీపిక పదుకొనే పై పగ బట్టిన ప్రభాస్.. వరుస షాక్స్.!

ఇక తాజాగా మహాభారతంలో కృష్ణుడు చెప్పే డైలాగ్ కల్కి 2898AD లో ఉన్నదాన్ని పోస్ట్ చేశారు.కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు..నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే అనే వీడియో పోస్ట్ చేయడమే కాకుండా జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు.. కానీ ఆ తర్వాత ఏం జరగాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.(Nag Aswin)

Nag Aswin countered Deepika Padukone

అయితే ప్రస్తుతం నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ దీపిక పదుకొనే కి కౌంటర్ గానే పెట్టారనే టాక్ వినిపిస్తోంది.మరి దీనిపై దీపిక పదుకొనే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే ఇప్పటివరకైతే దీపిక ఈ విషయంపై స్పందించలేదు.(Nag Aswin)

Share your love