
Deepika Padukone: దీపిక పదుకొనే ఈ మధ్యకాలంలో పనిగంటల విషయం గురించి వివాదాల బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా కూతురు పుట్టాక నెక్స్ట్ చేస్తున్న సినిమాల విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టింది. అంతే కాదు తన సినిమా కోసం ఎనిమిది గంటల సమయం కేటాయించలేనని, అలాగే ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్ కి రానని, నేను ఇచ్చిన డేట్స్ లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని,ఒక రోజులో 8 గంటల టైం కూడా ఇవ్వనని చెప్పడంతో పెద్ద ప్రాజెక్టులు అయినటువంటి కల్కి పార్ట్ -2, ప్రభాస్ స్పిరిట్ రెండు సినిమాల నుండి ఆమెను తొలగించారు.
Trolls on Deepika Padukone
దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.అయితే తాజాగా దీపిక 8 గంటల పని గురించి మరోసారి ఇంటర్వ్యూలో మాట్లాడింది. అందులో ఏం మాట్లాడిందంటే.. ఎక్కువ పని చేయడం అనేది సమాజంలో కామన్ గా మారిపోయింది.కానీ ఆరోగ్యంగా ఉంటేనే ఔట్ ఫుట్ అనేది బాగా వస్తుంది. కానీ ఎక్కువసేపు పనిచేస్తేనే పనిమీద నిబద్ధత ఉంది అని అనుకుంటున్నారు. ఒక మనిషి ఎనిమిది గంటలకు మించి పని చేయకూడదు. (Deepika Padukone)
Also Read: Samantha: నీకంటే పూసలమ్ముకునేదే నయం.. సమంతని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.!
ఎక్కువసేపు పనిచేయడం వల్ల అనారోగ్యం పాలయ్యి చేసిన పని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎంత పని చేసినా వేస్టే అంటూ ఎనిమిది గంటల పని సమయం గురించి స్పందించింది. అయితే దీపిక మాట్లాడిన మాటలపై చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు.

ఇప్పుడు నువ్వు షారుక్ ఖాన్ తో కలిసి వర్క్ చేస్తున్నావు ఎనిమిది గంటలు షూట్ చేయనని చెబుతావా.. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేస్తున్నావ్. ఆయనతో కూడా నాకు ఇష్టం వచ్చినంత సేపే సినిమా చేస్తానని అంటున్నావా అంటూ సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు చేస్తున్నారు.(Deepika Padukone)





