
OG Movie: తన దర్శకుడు సుజీత్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ విషయంలో.. స్టేజ్ మీదే ఆగ్రహం వ్యక్తం చేశారట పవన్ కళ్యాణ్. ట్రైలర్‌ని విడుదల చేయమని చెప్తే.. DI ఇంకా పూర్తవ్వలేదని సుజీత్ జవాబు ఇచ్చారు. దీంతో కోపాద్రిక్తుడై ‘ముందే ప్లాన్ చేసుకోవాలని తెలీదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. DI అవ్వకపోయినా ట్రైలర్‌ను రిలీజ్ చేయాల్సిందేనంటూ ఆదేశించారు పవన్ కళ్యాణ్. OG Movie
Pawan Kalyan fires at director Sujeeth OG Movie
సరే అన్నట్టు తలూపి.. సాంకేతిక బృందంతో మాట్లాడేందుకు వెళ్లిపోయారు సుజీత్. ఇక అటు బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిలిచిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వర్షం వస్తుందని ముందే తెలిసినా.. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదట చిత్ర బృందం. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ వంటి స్టార్స్ ఉన్నా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు గంటల పాటు కార్యక్రమం ఆలస్యం అయింది.
Also Read: Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!
ఈవెంట్ డిజాస్టర్ అవ్వడం ఒక ఎత్తు.. ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం మరో ఎత్తు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈవెంట్ పెట్టుకొని.. ట్రైలర్ కట్ చేయకపోవడం OG టీమ్ నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు. బహుశా ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇంతలా నిరాశపరచడం.. చరిత్రలో ఇదేనేమో! అంటూ విమర్శలు వస్తున్నాయి.
Also Read: India vs Pakistan: ఇవాళ్టి టీమిండియాను బాయ్ కాట్ చేయనున్న పాకిస్థాన్ ?





