Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !

Ambati Rambabu: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమాపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ సంచలన వీడియోను కూడా విడుదల చేశారు అంబటి రాంబాబు.

Ambati Rambabu Comments on OG Movie

పవన్ కళ్యాణ్ అలాగే అంబటి రాంబాబు ఇద్దరు బద్ద శత్రువుల అన్న సంగతి తెలిసిందే. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారైనప్పటికీ… వైసీపీ పార్టీలో అంబటి రాంబాబు ఉండగా జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. ఇక ఇటు…. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు వదిలేసి ఫుల్ టైం పొలిటిషన్ గా పవన్ కళ్యాణ్ ఉండాలని పదేపదే వైసిపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో… OG సినిమా హిట్ అవుతుందని అంబటి రాంబాబు వెల్లడించడం గమనార్హం.

Also Read: IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?

తనకున్న సినిమా పరిజ్ఞానం ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని తెలిపారు. బ్రో అలాగే హరిహర వీరమల్లు అనుకున్న విజయం సాధించకపోవడంతో OG సినిమాను కసిగా పవన్ కళ్యాణ్ తీసి ఉంటాడని… స్పష్టం చేశాడు. దర్శకుడు సుజిత్ కూడా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించి ఉంటారని అంచనా వేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పైన అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read: OG Movie: దర్శకుడు సుజీత్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్…స్టేజి పైనే ?

Share your love