Phone: బాత్రూంలలో ఫోన్ వాడుతున్నారా…!

Using your phone on the toilet 7 health conditions that tell you why it's a bad

Phone: ఫోన్లో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లలు పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లను అధికంగా వాడుతున్నారు. ఇక రోజులో కనీస టైమింగ్ అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లను పట్టుకొనే ఉంటున్నారు. ఫోన్లను అధికంగా వాడడం వల్ల ఎన్నో రకాల అనర్ధాలు వస్తాయని తెలిసినప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లని విపరీతంగా వాడుతున్నారు. ఫోన్లలో రేడియేషన్ కారణంగా కంటి చూపును కోల్పోతున్నారు. అధికంగా తలనొప్పి సంభవిస్తుంది. గుండె సమస్యలు కూడా వస్తాయి. చిన్నపిల్లలు కూడా నేటి కాలంలో ఫోన్లకు విపరీతంగా అలవాటు పడిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లను ఎక్కువగా వాడడం వల్ల వారి మెదడు పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. Phone

Using your phone on the toilet 7 health conditions that tell you why it’s a bad

చిన్నపిల్లలు ఫోన్లను ఎక్కువగా వాడడం వల్ల మెదడుపై ప్రభావం అధికంగా పడుతుంది. ఇక మరి కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఫోన్లను అస్సలు వదిలిపెట్టరు. మరి కొంతమంది బాత్రూంలలో కూడా ఫోన్లను వాడుతున్నారు. బాత్రూంలో ఉండే పది నిమిషాల పాటు కూడా ఫోన్లను పట్టుకొని కూర్చుంటున్నారు. దీనివల్ల అనేక రకాల అనర్ధాలు సంభవిస్తాయి. బాత్రూంలో చెడు బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. అలాంటి సమయంలో బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లి ఫోన్ ని చూస్తూ ఉండడం వల్ల ఫోన్ పై బ్యాక్టీరియా అధికంగా పడుతుంది. ఆ తర్వాత ఫోన్ ని మనం వాడడం వల్ల ఆ బ్యాక్టీరియా మన శరీరం అంతటా వ్యాపించి ఎలర్జీ, స్కిన్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఆ బ్యాక్టీరియా నోటి ద్వారా కడుపులోకి కూడా ప్రవేశిస్తుంది. దానివల్ల కడుపులో కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. Phone

Also Read: 13-year-old Afghan boy: విమానం బొక్కల్లో దూరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన కుర్రాడు

ఫోన్లను ఎక్కువగా వాడడం వల్ల అస్సలు మంచిది కాదని తెలిసినప్పటికీ బాత్రూంలో కూడా వీటిని వాడుతూ ఉంటారు. బాత్రూంలో ఫోన్లను వాడిన తర్వాత వాటిని ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఫోన్లను పట్టుకోవడం నోట్లో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వారికి బ్యాక్టీరియా అధికంగా వ్యాపిస్తుంది. దానివల్ల చిన్న పిల్లలకు స్కిన్ ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి. చర్మం దురద, దద్దుర్లు అధికంగా ఏర్పడతాయి. బాత్రూంలో ఫోన్లను వాడడం అస్సలు మంచిది కాదని వైద్యులు ఎన్నోసార్లు సూచనలు చేసినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అలానే బాత్రూంలో ఫోన్లను ఉన్నారు. బాత్రూంలోకి ఫోన్ ఎక్కువగా తీసుకెళ్లడం వల్ల ఫోన్ లో మునిగిపోయి వారు వెళ్లిన పనిని మరింత ఆలస్యం చేస్తారు. ఎక్కువ సమయం బాత్రూంలోనే గడుపుతారు.

Also Read: Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu