
Health: నవరాత్రి ఉపవాస సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలామందికి అనేక రకాల నమ్మకాలు ఉంటాయి. కొంతమంది నవరాత్రి ఉపవాస సమయాలలో పాలు, పండ్లు, తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. మరి కొంతమంది ఉపవాస సమయంలో టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. అయితే నిజానికి ఉపవాస సమయంలో టీ, కాఫీలు తాగకూడదని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పండితులు చెబుతున్నారు. అయితే ఉపవాస సమయంలో టీ, కాఫీలు ఎలాంటి సందేహాలు లేకుండా తాగవచ్చని పండితులు చెబుతున్నారు. టీ, కాఫీలు ఉపవాస సమయంలో తాగడం పూర్తిగా మన ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది. Health
Do you drink coffee and tea while fasting Over Health
ఉపవాస సమయంలో టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం కాస్త మంచిది కాదు. ఎక్కువగా కడుపు ఖాళీగా ఉండడమే మంచిది. ఆ సమయంలో కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. కాఫీ ముఖ్యంగా ఎక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఉపవాస సమయంలో ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు దీనిని తాగడం వల్ల సమస్యలు అధికంగా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా కడుపులో కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఉపవాస సమయంలో శరీరానికి శక్తి చాలా అవసరం. దానికోసం చాలామంది టీ, కాఫీలు తాగితే ఎనర్జీ వస్తుందని భావిస్తారు. వీటిని ప్రత్యామ్నాయంగా ఇతర ఆరోగ్యకరమైనవిగా కూడా ఉంటాయి. Health
Also Read: 13-year-old Afghan boy: విమానం బొక్కల్లో దూరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన కుర్రాడు
టీ, కాఫీలు కాకుండా ఉపవాస సమయంలో కొబ్బరినీరు, నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల కాస్త ఉపయోగంగా ఉంటుంది. అవి శరీరాన్ని కాస్త హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తాయి. అవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. తద్వారా ఉపవాస సమయంలో ప్రతి ఒక్కరూ టీ, కాఫీలు కాకుండా పండ్ల రసాలు, పాలు తాగినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అవి శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఆకలి వేయకుండా సహాయం చేస్తాయి. కడుపు నిండుగా అనిపిస్తుంది. నీరసం, అలసట లాంటి సమస్యలనుంచి దూరం అవచ్చు. నవరాత్రి సమయాలలోనే కాకుండా చాలామంది స్త్రీలు, పురుషులు వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో ఇకనుంచి ఎలాంటి సందేహాలు లేకుండా వారికి ఇష్టం ఉన్న పండ్ల రసాలను తాగవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు.
Also Read: Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !




