Raashii Khanna: తమిళ దర్శకుడితో రాశి ఖన్నాఎఫైర్ ?

Raashii Khanna: టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే వారి నటన, అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి రాశి ఖన్నా ఒకరు. ఈ భామ ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ కొనసాగించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలోను హీరోయిన్గా చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో తన హవాను కొనసాగించిన ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలలో నటించడం లేదు. Raashii Khanna

Raashi Khanna’s affair with a Tamil director

ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే అవకాశాలను అందుకుంటుంది. ఈ భామ తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ నటిస్తోంది. తమిళంలోనూ ఈ చిన్నది తన నటనతో మంచి పేరు, ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. ఇక సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే రాశి ఖన్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. కాగా, ఒకప్పుడు రాశి ఖన్నా ఎంతో బొద్దుగా ముద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సన్నగా హాట్ గా తయారు అయింది. ఒకప్పటి కన్నా రాశి కన్నా ఇప్పుడే ఎంతో అందంగా ఉందని చాలామంది అంటూ ఉంటారు. ఇదిలా ఉండగా…. ప్రస్తుతం రాశి ఖన్నాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాశిఖన్నా గత కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.Raashii Khanna

Also Read: Hardik Pandya-Mahieka Sharma: కొత్త ల‌వ‌ర్ ను ప‌రియం చేసిన‌ హార్దిక్ పాండ్యా…ఇంత‌కీ ఎవ‌రీ…

స్వయంగా రాశి ఖన్నా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాశి ఖన్నా తమిళ దర్శకుడితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా ఓ రూమర్ హాట్ టాపిక్ గా మారుతుంది. అంతేకాకుండా వీరిద్దరూ తొందరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం రాశి ఖన్నాకు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే రాశి ఖన్నా వివాహం చేసుకుంటే బాగుంటుందని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాశి ఖన్నా ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. Raashii Khanna

Also Read: Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నారా… అయితే జాగ్ర‌త్త‌, ఇవి క‌చ్చితంగా తెలుసుకోండి…

Share your love