
Tollywood: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశామని చెప్పారు. శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.Tollywood
Tollywood Actor Srikanth Iyengar Comments On Gandhi
మహాత్మా గాంధీ గురించి సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నాడని వివరించారు. ఇటువంటి వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుందని బాంబ్ పేల్చారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. Tollywood
Also Read: Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నారా… అయితే జాగ్రత్త, ఇవి కచ్చితంగా తెలుసుకోండి…
మా అసోసియేషన్ శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకుంటామని అన్నారని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సినిమా పెద్దలను కోరుతున్నాను.. మీరు దీనిపై స్పందించాలన్నారు. పెద్ద హీరోలు శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై స్పందించాలని పేర్కొన్నారు. ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేము యాంటీ బయోటిక్ కావల్సి వస్తుందని తెలిపారు. మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ కూడా దీనిపై మాట్లాడారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఈరోజుల్లో ఫ్యాషన్ అయ్యిందన్నారు. మాకు డిస్ప్లినరీ కమిటీ ఉంది.. చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా కమిటీ మీటింగ్ పెట్టి.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వివరించారు. Tollywood
Also Read: Hardik Pandya-Mahieka Sharma: కొత్త లవర్ ను పరియం చేసిన హార్దిక్ పాండ్యా…ఇంతకీ ఎవరీ…





