Anushka: స్టార్ క్రికెటర్ తో అనుష్క వివాహం ?

Anushka: టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది తెలుగు సినీ పరిశ్రమను ఒకానొక సమయంలో తన సినిమాలతో విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకుంది. తనదైన అందం, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ బ్యూటీ దాదాపు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా చేసింది. అనుష్కతో కలిసి సినిమాలలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపించేవారు. ఈ బ్యూటీకి అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు క్యూలో నిలబడే వారు. అంతటి హవా కనబరిచిన ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో నటించడం లేదు. కొత్త హీరోయిన్లు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడంతో అనుష్క శెట్టి హవా కాస్త తగ్గిపోయింది. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తోంది. Anushka

Anushka marriage to a star cricketer

సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది తన అభిమానులకు ఎప్పుడు చేరువలోనే ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి. అనుష్క శెట్టికి వయసు పెరిగినప్పటికీ అదే అందంతో అభిమానుల చూపును తన వైపుకు తిప్పుకుంటుంది. ఇదిలా ఉండగా… అనుష్క శెట్టి వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు పెళ్లి మాటే ఎత్తడం లేదు. ఎన్నోసార్లు అనుష్క శెట్టి వివాహానికి సంబంధించి అనేక రకాల వార్తలు బయటకు వచ్చాయి. Anushka

Also Read: BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?

కొంతమంది హీరోలతో అనుష్క ప్రేమలో ఉందని వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయినప్పటికీ ఈ బ్యూటీ ఇంతవరకు ఎవరిని వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. తాజాగా అనుష్క ఓ స్టార్ క్రికెటర్ ని వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఓ ప్రముఖ క్రికెటర్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని సమాచారం. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అనుష్క శెట్టి సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. Anushka

Also Read: Jubilee Hills bypoll: మాగంటి గోపీనాథ్ కు అసలైన వారసులం మేమే..కాంగ్రెస్ స్కెచ్ అదుర్స్…