Meena: దరిద్రం అంటే నాదే బంగారం లాంటి సినిమా ఛాన్స్ మిస్..అంతా దాని వల్లే.?

Meena Missed the blockbuster movie

Meena: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆమె అందచందాలతో ఓ ఊపు ఊపింది. ఈమె హీరోయిన్ గా వస్తుంది అంటే తప్పకుండా థియేటర్లకు అభిమానులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేవారు. అలాంటి హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీనా. ఈమె దాదాపు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలింది. అలాంటి మీనా నాగార్జున నటించిన ఒక బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నదట. ఆ చిత్రం ఏంటి వివరాలు చూద్దాం..

Meena Missed the blockbuster movie

నాగార్జున కెరీయర్లో అద్భుతమైన హిట్ సాధించిన చిత్రాల్లో గీతాంజలి ఒకటి.. 1989 లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అద్భుతమైన లవ్ స్టోరీ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గిరిజా కథానాయికగా చేసింది.. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా గిరిజ ను అనుకోలేదట. ముందుగా మీనాని ఉహించుకుని కథంతా పూర్తి చేసి ఆమెకు సంబంధించిన కాస్ట్యూమ్స్ కోసం కొలతలు కూడా తీసుకున్నారట. (Meena)

Also Read: Ravi Teja: ఆ పని చేయకపోతే సినిమా నుండి తీసేస్తా అంటూ రవితేజను బెదిరించిన డైరెక్టర్..!

కానీ చివరి సమయంలో మీనా మిస్ అయ్యిందట. అలా ఎందుకు జరిగింది అనే వివరాలు చూద్దాం.. కథ విని సినిమాకు ఓకే చెప్పింది మీనా. అంతేకాదు ఆమె కాస్ట్యూమ్స్ కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు. అలాగే ఈ గీతాంజలి సినిమాలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉంటారు అందులో చిన్నమ్మాయి పాత్రలో మీనాకు అవకాశం వచ్చింది. అయితే అన్ని పూర్తి చేసి సినిమా స్టార్ట్ అయ్యే మూమెంట్లో మీనాకు ఎగ్జామ్ ఉన్నాయని చెప్పి వాళ్ళ అమ్మ నటించడానికి ఒప్పుకోలేదట.

Meena Missed the blockbuster movie

దీంతో మీనా ఈ చిత్రాన్ని మిస్ చేసుకోవడంతో గిరిజకు ఈ సినిమా అవకాశం వెళ్లిపోయింది. ఈ విధంగా సినిమా అద్భుతమైన హిట్ సాధించడంతో మీనా చాలా బాధపడిందట.. అయితే ఆ తర్వాత నాగార్జునతో మీనా చాలా చిత్రాల్లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అనేక మూవీస్ అద్భుతమైన హిట్ సాధించాయి. ప్రస్తుతం మీనా అమ్మ, వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.(Meena)

Share your love