

OG Movie: పవన్ కళ్యాణ్ ఈ హీరో పేరు చెప్పగానే ఎవరికైనా గూజ్ బంప్స్ పుడతాయి. అలాంటి పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా కానీ యాక్టింగ్ స్టైల్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల ఫ్యాన్స్ ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కుంటారు. ఆయన ఇప్పటివరకు పాన్ ఇండియా చిత్రాల్లో పెద్దగా నటించకపోయినా కానీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు అయితే వచ్చింది.
Actress who gave up the heroine role in the OG Movie
కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్లారు. అలాంటి పవన్ గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే.. అలాంటి ఈ పవర్ స్టార్ తో సినిమా ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు.. కళ్ళు మూసుకొని ఒప్పుకుంటారు.. అంతేకాదు ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఆయనతో నటించే అవకాశం రావాలని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చిన ఆ హీరోయిన్ మాత్రం రిజెక్ట్ చేసిందట. (OG Movie)
Also Read: OG Movie: ‘ఓజీ’ ట్రైలర్ డీకోడ్.. ఆ లింక్ ని కనిపెట్టిన ఫ్యాన్స్.. ఇక రచ్చ రచ్చే!!
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ వివరాలు చూద్దామా. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. అలాంటి ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నయనతారను తీసుకుందామని ఆఫర్ చేశారట. కానీ నయనతార కథ మొత్తం విన్న తర్వాత సినిమాలో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని రిజెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

ఆ తర్వాత డైరెక్టర్ సుజిత్ ప్రియాంక అరుల్ మోహన్ ను అప్రోచ్ అయ్యారట. ఆమె ఓకే చెప్పడంతో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది. ఈ విధంగా పవన్ ప్రియాంక కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది.మరి చూడాలి ఈ చిత్రం ఎలాంటి హిట్ కొడుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.(OG Movie)







