
OG Movie: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి.. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వచ్చి అది సక్సెస్ కొట్టింది.దీంతో పవన్ సినీ అభిమానులకు, రాజకీయ అభిమానులందరికీ ఎంతో ఆనందమనిపిస్తోందని చెప్పవచ్చు. అలాంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఇందులో ప్రతి ఒక్కరూ స్టార్ నటులే చేసారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరించారు.
Rashmika boyfriend missed out on the villain role in the OG Movie
అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రియాంక, ఇమ్రాన్ హష్మీ ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, రావు రమేష్, అభిమన్యు సింగ్, గోపి, వంటి సీనియర్ నటులు నటించారు. ఈ విధంగా అన్ని హంగులు కలగలిపి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ సుజిత్.. అలాంటి ఈ సినిమాలో విలన్ ఇతర పాత్రలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. అయితే ఓజీ చిత్రంలో ఫేమస్ నటులు అయినటువంటి టబు, మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలను తీసుకుందాం అనుకున్నారట..(OG Movie)
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో చాలా బిజీగా ఉండడంవల్ల ఆయన ఎప్పుడూ షూటింగ్ కి వస్తున్నారో తెలియదు.. కాబట్టి ఆ పెద్ద పెద్ద నటులను సెలెక్ట్ చేసుకుంటే వారి డేట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ కు డేట్స్ కుదరకపోతే ఇబ్బంది అవుతుందని పవన్ కళ్యాణ్ చిన్న చిన్న నటులను తీసుకోమని చెప్పారట. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు మెయిన్ విలన్ గా మొదట కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిని తీసుకోవాలని అనుకున్నారట.

కానీ ఆయన డేట్స్ కు, పవన్ డేట్స్ కు అసలు కుదరదని చెప్పి బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓజి చిత్రంలో రక్షిత్ శెట్టి విలన్ గా ఉంటే ఈ సినిమా మరింత బాగుండేది అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఓజీ చిత్రం పవన్ అభిమానుల్లో సంబరాలు నింపిందని చెప్పవచ్చు.(OG Movie)





Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!