War 2 OTT: ఒటీటీ రికార్డుల దుమ్ము దులిపేస్తున్న ఎన్టీఆర్ ‘ వార్ 2’

War 2 OTT: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ‘వార్ 2 (War 2)’ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.

War 2 OTT record breaking views

ఓర్‌మాక్స్ సర్వే ప్రకారం, కేవలం వారం రోజుల్లోనే 3.5 మిలియన్ల వ్యూస్ సాధించి, ‘వార్ 2’ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో లభ్యమవుతున్న ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది. ప్రత్యేకించి Hrithik Roshan మరియు Jr NTR chemistry ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లు మాత్రమే వసూలు చేసి ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీ ప్రపంచంలో మాత్రం తన సత్తా చాటింది. అదే సమయంలో ‘Coolie’ సినిమా రూ. 500 కోట్ల వసూళ్లతో థియేటర్లలో హిట్ అయినా, OTTలో ‘వార్ 2’ కంటే వెనుకబడింది.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘వార్ 2’ హిందీ వెర్షన్ viewership 3.5 మిలియన్లు దాటగా, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కూలీ’ కేవలం 2.6 మిలియన్ల వ్యూస్‌కే పరిమితమైంది. ఈ విజయం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన గ్లోబల్ క్రేజ్, digital dominanceని మరోసారి నిరూపించారు. థియేటర్లలో వెనుకబడినా, ఓటీటీలో ‘వార్ 2’ స్పష్టమైన గెలుపును నమోదు చేసింది.

Share your love