
Gadari Kishore Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియా సాక్షిగా.. దున్నపోతు అని పొన్నం ప్రభాకర్ తిట్టినా, పంచాయతీ పెట్టకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న బతుకు నీది అంటూ చురకలు అంటించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడి, జైళ్ల పాలై, రాష్ట్రాన్ని సాధించి, అద్భుత పాలన అందించిన నాయకులపై నువ్వు మాట్లాడుతావా? అని ఫైర్ అయ్యారు. Gadari Kishore Kumar
Gadari Kishore Kumar on adluri laxman
పదా.. ‘దున్నపోతు’ మాటపై నువ్వు ప్రమాణం చేస్తావో? పొన్నం ప్రమాణం చేస్తాడో చేయండి చూద్దామంటూ గాదరి కిషోర్ ఛాలెంజ్ విసిరారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. అదే సమయంలో చామలపై కూడా రెచ్చిపోయారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. చామల కిరణ్ కుమార్ కాదు.. చా‘మలం’ కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఇజ్జత్ తీసారు. Gadari Kishore Kumar
Also Read: KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే
గతంలో ZPTC టికెట్ ఇవ్వకపోతే.. వంకాయ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే 100 ఓట్లు వచ్చాయని షాకింగ్ నిజాలు బయట పెట్టారు. అలాంటోడు.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. అంతేకాదు.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే తమ వాళ్లకి బుద్ధి వస్తుందని స్వయంగా కిరణే చెప్తున్నాడని చురకలు అంటించారు గాదరి కిషోర్. Gadari Kishore Kumar
Also Read: Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?





