
Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి గత కొన్ని రోజులుగా “ఆమె సన్యాసం తీసుకోబోతున్నారు” అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పుకార్లకు స్వయంగా ఆమెనే ముగింపు పలికారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలని, “నేను బాధ్యత లేని తల్లి కాను” అని స్పష్టంగా పేర్కొన్నారు.
Renu Desai clarifies sanyas rumors clearly
రేణు వివరాలు చెబుతూ చెప్పారు – ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ సరదాగా అడిగిన ప్రశ్నకు “సన్యాసం తీసుకుంటా” అని హాస్యంగా చెప్పానని తెలిపారు. కానీ కొన్ని మీడియా సంస్థలు దానిని సీరియస్‌గా తీసుకుని, తాను నిజంగానే సన్యాసం తీసుకుంటున్నట్లు కథనాలు రాయడంతో ఈ గందరగోళం ఏర్పడిందని అన్నారు.
ఆమె మరింత క్లారిటీ ఇచ్చారు — “నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. వాళ్లను వదిలేసి నేను సన్యాసం తీసుకోను. నా పిల్లల బాగోగులు చూసుకోవడం నా ప్రథమ బాధ్యత. ఆధ్యాత్మికత అంటే సన్యాసం కాదు, అది జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం” అని వ్యాఖ్యానించారు. ఇంకా, “ఇప్పుడు నా వయసు 45 మాత్రమే. 65 ఏళ్ల తర్వాతే అలాంటి ఆలోచన వస్తుంది” అని నవ్వుతూ తెలిపారు.
అలాగే, మీడియా తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సమాజంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రేణు దేశాయ్, ఇటీవల టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో తిరిగి నటనలోకి అడుగుపెట్టారు. నటనతో పాటు animal welfare, spiritual awareness, social causes లాంటి అంశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

